సుమనస్కుడు
సుగంధేన వినా పుష్పం
కుత్రాపిచ నశోభతే
సదాచార్వినా కో~పి పూజ్యతాం
నాధి గఛ్ఛతి
అనువాదం:---
తావి లేని విరులు తామెంత సొబగైన
మెప్పు పొంద గలవె గొప్పగాను
మంచి నడత లేని మానవుండంతట
వాసికెక్క గలడె వసుధలోన
(తెనిగింపు --విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)
సుభాషితం -
--------------
అంజలిస్తాని పుష్పాణి
వాసయంతి కరద్వయం ౹
అహో సుమనసాం
ప్రీతిర్వామదక్షిణయో: సమా౹౹
చేతిలో ఉన్న పువ్వులు భేదం లేకుండా రెండూ చేతుల్లో,సుగంధ భరితంగా ఉంటాయి.అలాగే,సహృదయులు చెడ్డవాళ్ళని,మంచివారిని బేధం లేకుండా సమంగా ప్రేమిస్తారు
అంజలందునుండునలరురెప్పుడుకూడ
పాణిద్వయికిపంచు పరిమళంబు
మంచిచెడ్డలనకమంచివాడెప్పుడు
ప్రేమనంతపెంచు పేర్మిమీర
(తెనిగింపు --విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి