తారకమంత్రము
తారక మంత్రంబు తడయక జపియించి
తాత్పర్యమెరిగిన తపసియతడు
భుజగమ్ము లెల్లను భూషణమ్ములుకాగ
భోగీశుడైనాడు భువనమందు
దాక్షిణ్య దృష్టిచే దక్షిణా మూర్తియై
పరతత్త్వ మెరిగించు గురువు తాను
కాలకూటవిషము కంఠంబులోదాచి
జగములు కాచిన జాలిగుండె
ఆశవసన మాయె అశనంబు బిక్షమ్ము
మంచుకొండ నుండు మౌనియతడు
భక్తజనులపాలి భవరోగ వైద్యండు
సర్వశుభములిచ్చు శంకరుండు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి