పసిడి మహిమ

*సూక్తి సుధ*
యస్యాస్తి విత్తం స నరః కులీనః
స పండితః స శ్రుతిమాన్ గుణజ్ఞః
స ఏవ వక్తా సచ దర్శనీయః
సర్వే గుణాః కాంచనమాశ్రయంతి

ఈ లోకంలో ధనమున్నవాడే సద్వంశస్థుడు. అతడే పండితుడు, శాస్త్రాలెరిగినవాడు, గుణవంతుడు. అతడే వక్త. అతడే చూడదగిన వాడు. అన్ని గుణాలు బంగారాన్ని (ధనాన్ని) ఆశ్రయించి ఉంటాయి.

సంపదున్నవాడె సద్వంశడగునోయి
మదనసుందరుండుమాటకారి
శాస్త్రమొరగుసూరి సద్గుణొత్తముడౌను
పసడివశముచేత బ్రతికె గుణము
(తెనిగింపు --విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత