దత్తపది
దత్తపది----
రాగము-,భోగము-యాగము-యోగము -, కుటుంబవ్యవస్థ
అనురాగమొక్కటియాలంబనమొసగ
సకుటుంబసౌఖ్యమ్ము సాధ్యమగును
భోగమ్ముభాగ్యంబుభువనాళికందించు
ఆత్మీయబంధమెయభిలషితము
తల్లిదంద్రులపూజ ధార్మికయాగంబు
అతిథిపూజయెయభిలషితము
దీనజనులసేవ దివ్యమౌయోగమ్ము
ధాత్రిజనులకెల్లధర్మమిదియె
ఇహముపరములిచ్చునీశ్వర ధ్యానంబు
భక్తియోగమంతముక్తినొసగు
ఆధ్యయనముతోడియధ్యాపకత్వము
మనకుశాంతినొసగు మంత్రమిదియె
(రచన:-విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి