స్వగతము
అనుకరించనెపుడునన్యులెవరినైన
ఆశ్రయించనెపుడు నన్యజనుల
చిత్తానశివుడుండచింతేమియుండును
జగదాంబుచూపెడుజాలిచాలు
మాధవుడెప్పుడుమాతోడునీడగా
కనురెప్పలట్లుగాకాచియుండు
వలెలాంబతల్లియె వరవృష్టికురిపించి
వర్ధిష్ణువైనట్లువరములొసగె
ఎల్లలేలేనట్టియిలవేల్పుయెల్లమ్మ
కామితార్థమొసగుకల్పవల్లి
అమ్మనాన్నలెపుడునాశిస్సులందించ
కొరతలేమియుండుకొత్తగాను
నలువరాసినంత నాణ్యంపురాతను
నమ్మినట్టివాడునాగరాజు
(రచన:-విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి