ఎండల. మల్లికార్జనుడు

ఎండలో యెండుతూ యెట్లుందువోస్వామి
నీడపట్టున లేవె నీలకంఠ
చర్మంపు వసనమే చలికెట్లు యాగును
ఉన్నిదుస్తులతోడ నుడుపు లేక
వానలో నానుతూ వజవజా వనుకుతూ
ఎట్లుంటివోదేవ యెవరులేక
ఎండలో నుండగా యెండల మల్లన్న
నీడలో నుండమా నీలకంఠ
పరిణామ శీలంపు ప్రకృతితో  నాకేల
పొలములో నుండగా ప్రొద్దుపోవు
ఆ.వే 
అనుచు తలచెనేమొయసుతోషుడంతట
భక్త జనులకెల్ల ముక్తి నొసగ
అవతరించెజనులనందుబాటుకొరకు
శివుని చిత్త మెపుడుశివుని కెరుక
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత