ఆదిశంకరులు

ఆర్యాంబశివగుర్వులందాలబిడ్డడు
శంకరాచార్యులై జననమందె
వేదాలు శాస్త్రాలు వేదాంత మర్మాలు
అభ్యసించినరీతియధ్భుతమ్ము
కరుణాంతరంగుడు కారుణ్య దృష్టితో
కానకధారనొసగి కవిత బాపె
పూర్ణాంతరంగుడు పూర్ణాస్రవంతిని
దారిమార్చెనతడు తల్లి కొరకు
ఆ.వె.వేదధర్మమంత వేద్యంబుసేయగ
దీక్షపూనినట్టి ధీరవరుడు
అమ్మ యాజ్ఞతోడ నాచార్యవర్యుడై
వేదరక్ష సేయ వెడలినాడు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత