పితృ పుత్ర బంధము

ధిక్ తస్య జన్మ యః పిత్రా
లోకే విజ్ఞాయతే నరః।
యత్పుత్రాత్ ఖ్యాతిమభ్యేతి
తస్య జన్మ సుజన్మనః॥

        ..... మార్కణ్డేయపురాణమ్ - 1.101

"ఎవడు తండ్రి యొక్క ఖ్యాతి చేత లోకానికి తెలియబడుచున్నాడో వాడి జన్మ వ్యర్థం....... 
*ఏ తండ్రి పుత్రుడియొక్క జన్మ వలన కీర్తించబడుతున్నాడో ఆ తండ్రి జన్మయే సార్థకం."*

తండ్రి ఘనత చేత తనయుడు ఘనుడైన
వానిజన్మయెపుడు వ్యర్థ జన్మె
సుతునిచేత తండ్రి స్తుతి పాత్రుడైనను
జనకునొక్కజన్మ సార్థకమ్ము
(తెనిగింపు --విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి).

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత