గతము -వర్తమానము

గతముమే లునుచునువర్తమానమొదలొద్దు
కానరాదుమరలగతము నీకు
కలలందునూహలుకలతలు రేపును
వర్తమానమొకటె భావిజీవితపుబాట
చెరుకుపిప్పినమల చేకూరుదెప్పుడు
"నీ"రసముమిగులునీకు నిజము
భవితపై నీవెంత భ్రమలుంచు కొన్నాను
వాస్తవంబౌవునె వసుధ లోన
నేటి నీనడతయే నీగమ్యంబునకింక
బంగారు బాటకు మార్గమేయి
ఆ‌వె. ఉన్న వాస్తవంబు నూతగాకైగొన్న
విజయమందగలడు విభుదుదెఫుడు
శిఖరమెక్కగలము చిన్నియడుగుతోనె
అనుభవంబుయెపుడు నాది గురువు
(రచన;--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత