on line services
On line services are available
చివరిచూపుకైన చిన్నారి పొన్నారి
చింటుబంటులిపుడు చితికినిప్పు
ఆనులైనతోడయంటించకలరయ్య
అట్టి వసతి నేడు నబ్బె నిట్లు
అపుడువారు నీకు నడ్డాల బిడ్డలు
గడ్డమంత మొలువ గడుసుదేరె
గ్రీను కార్డు లున్న గీర్వాణ మతులాయె
కర్మకాండలెల్ల కల్ల లాయె
వానప్రస్తమనుచు వసతివృధ్ధాశ్రంబు
పరుల పంచలిపుడు బ్రతుకులాయె
తులసితీర్థ వాంఛ తీరునా మీకింక
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి