కార్తీక దీపము
కార్తీక దీపాన్ని కండ్లార తిలకించి
పులకించినారయ్య పోలిసూలు
చోరుడైననునేమి వీరాభిమాని గా
మార్చగలిగినట్టి మర్మమిదియె
బంధింపబడినట్టి భావంబులేకుండ
రసడోలికలయందు లాగబడుట
యజమానియైననుయజమానురాలైన
పైకంబు చింతను ప్రక్కనిడిగ
ఆహ్లాదహృదయంబునానందమందించు
కథయున్నచాలంచు కాంక్షపెంచి
ఇహలోక లీలయె యింటిలో నుండగా
పరలోక చింతతోబాధవీడి
వీక్షించుసౌఖ్యంబు విలువకట్టగలేము
అనుచుతలచునట్టి యధ్భుతమ్ము
కాలమహిమకాక కలికాలం మహిమయో
నిర్ణయంపుతరమె నిపుణులకైనను
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి