మూల పాపము---మూర్ఖబుధ్ధి
పుట్టుపాపులెవరు పుడమిలో పుట్టరు
కర్మశేషమున్న కలుగుజన్మ
పూర్ణస్వర్గమైన పుర్ణమౌ నరకమ్ము
ఎవ్వరివ్వగలరు యేటి మాట?
భూమిగోళమన్న పురుగుతొలొచినట్లు
మంద బుద్ధి కట్లు మతికిదోచు
బల్లపరుపు భూమి బాగుండునట్లుగా
సాక్ష్యమనుచు జూపు చావుతెలివి
భూమిచెదరమన్న బుధ్ధిలేనిపలుకు
భూమికేంద్రమన్న బొంకు మాట
నమ్మినట్టివాడు నట్టేటముణిగేను
ఆత్మ జ్ఞానమొకటె యసలు నిజము
అమృతపుత్రులన్నయసలైనమాటను
మరచినారుమీరు భ్రాంతితోడ
పాపియనుచుమీరు పలురీతిగీతాలు
పల్లవించనేల పాటపాడి
మూఢనమ్మకాల ముప్పేటదాడిలో
శాస్త్ర జ్ఞానమంత చచ్చిపోయె
విగ్రహంపుపూజ విషమంచు భావించి
చెక్క పూజచేయ సిగ్గు పడిరె)
శాస్త్రవేత్త లెల్ల శ్రాధ్ధాల పాలైరి
రాళ్ళ శిక్ష లెల్ల రాజ్యమేలె
పాపపరిహరంపు పత్రాలనెల్లను
విక్రయించి రపుడు విపణిలోన
పండుదొరకగానెపాపమాదంపతులు
పండుతినుటవలన పాపులనుచు
శాపమిచ్చు ప్రభువు శాసకుండౌనంచు
దైవజనులపలుకు తీరు గనుడు
కరుణమాలినట్టి కఠినమౌదేవుని
దేవుడనగరాదు దెయ్యమగను
లూతకథలవిన్నరోతకలుగునంచు
వదిలివేసి యిపుడు వార్తకలదు
బల్లపరుపు బుధ్ధి బలవత్తరంబైన
బుధ్ధి మాంద్యమగుట ముచ్చటగును
పూర్ణ బుధ్ధి లేక పురుగులు పుట్టగా
ఏమి చేయగలరు యెవరుకూడ
ఆత్మ శుధ్ధి చేయ నరుగుదెంచెనకట
దైవ జనని మాట దైవ మెరుగు
దేహశుధ్ధి జరిగె.దైవజనులచేత
పాత్ర మెరుగ వలయు భొధ చేయ
పాపియనుచు పలుమారు పలవింప
పాపివైతివీవు ఫలితమింతె
మూలపాప మనుచు మూర్ఖంపు బుధ్ధితో
కలవరించనేల కష్ట చరిత!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి