శ్రావణ శుధ్ధదశమి

74 శ్రావణంలో నామనసులో మాట
-----------------------------------
మసులోమాటనుమది విప్పి చెప్పుదు
మన్నించవలెనయ్య నాదుమాట
రాయలేలినసీమరత్నాలసీమలో
జన్మమెత్తితినేను జడవనెపుడు
ప్రథమశత్రువనెడి ప్రఖ్యాతిచెందితి
బంధుజనులచేత బాగుగాను
పటికబెల్లమటులపలుకలేనెప్పుడు
పలుగురాయివలెను పలుకువాడ
తిట్లన్ని నేనంత దీవెన లట్లుగా
అందుకొనుటలోన యాశనాకు
పుట్టకతోవచ్చిన బుధ్ధేమి పొదంచు
నవ్విపోదురుగాక నన్నుచూచి
ఉచితమౌసలహాలనూరకేనివ్వగా
నీకేమిపనియంచునీల్గు లెన్నొ
చదువంతనేర్చినా చాతుర్యమేరాదు
బ్రతకనేర్చినతెల్వి పడయలేదు
పెట్లకొయ్యయనెడు పేరునుపొందితి
మార్చుకోలేనట్టి మంకుతనము
లౌక్యంబునేర్వని లోపంబునీదంచు
ఆత్మీయులెల్లరు ననుట నిజము
ఆ.వె.వంగివంగి తలనువంచెడివిద్య
పెట్టుబడిగనేను పెట్టలేదు
నేతిబీరలోని నెయ్యని పిండగా
అభ్యసింపనట్టి యర్భకుణ్ణి
(రచన :- విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
(తెలుగు తిథుల ప్రకారం శ్రావణ శుధ్ధ దశమి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత