దక్షిణామూర్తి
వటవృక‌్ష మూలన నిటలాక్షుడీరీతి
దక్షిణా మూర్తిగా దయను చూపె
మౌనీంద్రులెల్లరు ముదుసలులైనారు
గురువేమొ తరుణుండు గుప్తగామి
మౌనముద్రనుపూనిమరియేమితెలిపెనో
ఛిన్నసంశయులైరి శిష్యులంత
చిన్ముద్రచూపించి చిరతర జ్జానమ్ము
అద్వైత తత్త్వంబు నందజేసె
బ్రహ్మమే నిత్యంబు పరమమౌ సత్యంబు
పరిణామ శీలమ్ము ప్రకృతియంత
జీవుడే బ్రహ్మమ్ము చివరకౌను
వేదాంతతత్త్వాన్ని వేద్యమౌరీతిగా
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి