ఆత్మతృప్తి

"అసారే ఖలు సంసారే 
సుఖభ్రాన్తిః శరీరిణామ్ ।
లాలాపానమివాఙ్గుష్ఠే
 బాలానాం స్తన్యవిభ్రమః"

సారమేమి లేని సంసార మందున
సుఖము దొరకు ననుచు చూచు నరుడు
బొటన వ్రేలు చీకు బాలుడట్లు భ్రమల
అమ్మ పాల కొరకు నాశపడియు

బొటనవేలు నోటిలో పెట్టుకొని తన లాలాజలాన్నే చప్పరిస్తూ చనుపాలు త్రాగుతున్నానని పసిబాలుడు భ్రమించి నట్లే సారం లేని ఈ సంసారంలో ఏదో సుఖం ఉందని మానవులు భ్రాంతి చెందుతూ ఉంటారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత