వీర సైనికులు
దేశభక్తియుతులు ధీరమతులువీరు
భరతమాతకొరకు ప్రాణ మొసగ
నడుముబిగించిన నవయోధవరులయ్య
వెన్నుచూపరెపుడు వైరికెపుడు
మలమాల మాడ్చెడు మరుభూమి యైనను
లెక్కచేయరెపుడు యెక్క డైన
ఊపిరందనియట్టి యున్నత గిరులెల్ల
ఎక్కకలిగినట్టి యోధులోయి
హిమపాత మెంతయో హింసించి బాధించ
సరుకుచేయరెపుడు సాహసాన
ఆ.వే. దేశ భక్తి కల్గి ధైర్యంబు తోతాము
వీర మరణమందు వీరు లెపుడు
పుడమిలోన మనకు పూజనీయులగుట
స్పూర్తి దాయ కంబు సుజను లార!
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
వీర వరుని పత్ని ధీరత్వబుధ్ధీతో
సాగనంపునతని సమర భూమి
వీరపత్ని కాన విలపనమ్మంతను
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి