ఉపవాస భావన
ఉపవాస భావన ఉదరపోషణకైన
అశనమే మేలన్న నాశ కలుగు
పాపరహిత మైన పావన భక్తియె
ఉపవాస మన్నట్లు నూహ కలదు
పరమాత్ము చెంతన పరమాత్ము చింతన
ఉపవాస మయ్యెను నుర్విపైన
పత్రపుష్పములతో పరమాత్మ పూజయె
ఉపవాసమగునునుర్విపైన
జాగరంబు యనగ జంజాట మైనట్టి
చలన చిత్ర వీక్ష జరగ రాదు
శివుని పైని నీవు చిత్తంబు నిల్పగా
శివని రాత్రి.పేరు చెల్లు నమ్మ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి