మాల దాసరి కథ--2 భాగం

మాల దాసరి కథ (రెండవ భాగము)
---++++-------+++++------++++-----+++ 
మాలదాసరి బ్రహ్మ రాక్షసంవాదం 
®®©©©©©®©©©©®®®®
 మాల దాసరి బ్రహ్మ రాక్షస శాస్త్రార్థన్ని ఆలకిద్దాము.
బ్రహ్మ రాక్షసునిచేతికి చిక్కి బందీయైన విష్ణభక్తుడు ధైర్యంతో భగవధ్భక్తి నిండుగా కలిగిన వాడు కాన ధైర్యంతో "", ఓ రాత్రిచర! ఒక మాటవిను. అంత తొందరదేనికి నేను నీకు వడ్డించిన విస్తరిని. ఎక్కడికి పోతాను చెప్పు?
ప్రాణరక్షణ మానవులకు అవశ్యకర్తవ్యం కాబట్ఝి ఇంత సేపు నీతో పెనుగులాడాను. అలా ప్రయత్నించక పోవడం మహా పాపం కావున నీతో పోట్లాడవలసి వచ్చింది. ఇందుకు నీవు కోపం తెచ్చుకోకు. నాకు ఈ శరీరం మీద వ్యామోహం లేదు. ఈ దేహం ఎలాయైనా చాలించవలసినదే కదా! హీనమైన మానవజన్మ విడిచి పెట్టడమే మంచిది. అది మోక్షం పొందడానికి దగ్గరిదారి కదా!
నా దేహత్యాగం వల్ల ఒక ప్రాణి సంతోషపడటం కన్నా కావలసింది ఏమున్నది.
శిబి చక్రవర్తి వారు తమ దేహాన్ని కోసియీచ్చి ముక్తిని పొంది మానవాళికి ఆదర్శ ప్రాయులైనారు కదా!
ప్రాణం పోవడానికి ఎన్నో కారణాలు. రోగం వల్లగాని గ్రహపీడలవలనగానీ తేలు పాము లాంటి విష జంతువుల వల్ల మరణం సంభవించ వచ్చు.మనో వ్యాధితో గానీ ,నీటిలో పడడం వల్లగానీ మరణించ వచ్చు. కౄరజంతువల్లవల్లగానీ దురలవాట్లు వల్లగానీ ,వ్రణ బాధవల్లగానీ చావు రావచ్చు. ఇటువంటి అల్పమైన కారణాలవల్ల శరీరం రాలిపోవడం కన్నా ఏ ఒక్కరి ఆకలి తీర్చకలిగితే మంచిదే కదా!
అది అటుండనీ నీకొక మంచి మాట సెపుతాను. అది కూడా ప్రాణ భయముతో చెప్పె మాట కాదుసుమా! నేను చెప్పె హితోపదేశం ఎదో మధ్యవర్తిగా పెద్ద బుధ్ధితో చెప్పెమాటలుగా నైనా విను. నీవు వినకపోయినా నాకు నష్టం లేదు. నేను చెప్పె మాటలను ఆ యీశ్వరుడైనా హర్షిస్తాడు గదా! నీవు పెద్దపులి సింహము తోడేలు వంటి కౄరజంతువుల జాతికి చెందిన వాడవు కావు. నీవు దేవ యోనివి (పిశాచో గుహ్యక సిధ్ధో భూతోమి దేవయోనయః) .నీకు కూడా మావలనే కరచరాణాది అవయవాలు వున్నాయి.మా వలెనే నీవు మాట్లాడగలవు.
యుక్తాయుక్త విచాక్షణా జ్ఞానము మా వలనె నీకు సమానము.
ఒక మాట చెప్పడం మరిచాను చెట్లు కొండలు వంటి స్థావరాలకంటె క్రిమికీటాకాలు మెరుగు.వాటి కంటె జంతువులుపక్షి జాతులు మేలైనవి. వాటి కన్నా మానవులము చాలా మెరుగు. మాకంటె ఎన్నోరెట్లు దేహాది పాటవాలతో మీరు ఇంకా మెరుగైన వారు.
మాకంటె తెలివి తేటలు విజ్ఞానము మీకు ఇంకా అధికమే కదా! అట్టి గొప్ప వాడివైన నీవు ఇంత భయంకరమైన పనిచేయవచ్చా? తప్పుకదూ! 
ఏదితినవచ్చో ఏదితాగవచ్చో అనే విచక్షణ లేకుండా పోవడం మంచిదేనా ? ఈ తిండిలో రుచిగాని శుచిగానీ వుందా? ఈ ఆహారం హింసతో కూడినది.ఈ తిండితినడం వల్ల పరలోకంలో బాధకరమైన ఫలితాన్ని యిస్తుంది. మరణించిన తరువాత నరక లోకం వచ్చేది.ఇప్పుడు దానికంత దిగులెందకనవద్దు. మేము చిరకాలం జీవిస్తాము కదా! మాకు నరకలోక హింసవల్ల ఏమి భయము అని అనుకోవద్దు.మాకు మరణం నేడైనా రేపైనా కావచ్చు. మీకు మరణ భయం ఇప్పుడు లేకపోయినా యుగాంతంలోనైనా తప్పదు సుమా! జీవులజీవనకాలములో హెచ్చుతగ్గులుండవచ్చు. ఐనా వాటి తారతమ్య చర్చల వల్ల లాభమేమి? పరమాణువైనా పర్వతమైనా యుగాంత జలప్రళయం లో ముణిగిపోక తప్పదు. ఇక చిన్నా పెద్దా తేడాలెందుకు? పుట్టిన ప్రతిజీవి పరలోకాన్ని గురించి ఆలోచించాలికదా!
 తపస్సుద్వారా సిధ్ధించిన వరగర్వముతో చెలరఘగి దేవతలను గడగడలాడించి బాధించిన హిరణ్యకశిప రావణాదులు కూడా తమ చేతిలో పరాజితులైన యముని చేతిలో చిక్కలేదా? భూమిపై మీ రెంత బలవంతులో పరలోకమున వారు మీకన్నా బలవంతులు.అందంకే కదా! చంద్రుడు సకల రసాలకన్నా గొప్పదైన అమృతాన్ని దేవతలకు అందిస్తున్నాడు.చంద్రునీ ప్రథమకళను అగ్నిదేవుడు అనుభవిస్తున్నాడు‌.ఈ విషయిన్ని మావంటివారు చెప్పరాదు.ఈ విషయాలన్ని సకాల్యంగా ఆలోచించి నీకు నచ్చినట్లు చేయ" మని చెప్పాడు వీష్ణభక్తుడు.
ఈ మాటలు విన్నంతనే బ్రహ్మరాక్షసుడు వికటాట్ట హాసంచేసి"
" చంపకు చదువుల మేము ప
టింపని శాస్త్రములే? మాపఠింపని శృతులే ?
యింప వవి నమ్మవే ""ప్రథ
మాంపిబతే వహ్ని"" యనెడు మాటవు గాదె"
 ఈ చిన్న కందపద్యంలో కృష్ణ రాయలు తెలుగు నుడికారములోని వెటకారమునంత పూర్తిగా నింపేసాడు.చూడగా చూడగా ఈ బ్రహ్మ రాక్షసుడు కాస్తా తెలంగు వాడేమోనని పిస్తుంది.
"ఓ దాసరీ ఈ చదువుల సంగతి చెప్పి నన్ను చంపకు.(తెలంగు వాడు ఏదైన అలవికాని కొత్త విషయం చెప్పి ఈపని చేయమని అడీగితే చంపావ్ పో! అనడం అలవాటు కదా! ). మేము చదవని శాస్త్రొలున్నాయా? వేదాలున్నాయా? చంద్రని మొదటి కళను [ ప్రథమాం పిబతే వహ్ని] అగ్ని దేవుడు త్రాగుతాడు అన్న మాటే కదా వేదం చెప్పింది.
మేము దేవతలకు అన్నదమ్ములవరసన్నావుబాగుంది,వారంతా అమృతాన్ని తాగుతారన్నావు. ప్రతి పాడ్యమి తిథి నాడు ముందుగా అగ్నిదేవుడు స్వీకరస్తాడన్నావు. అదీ బాగుంది.మరి అగ్నిదేవుడు సర్వభక్షకుడు కదా! ఈ మాటచాలు. వారికొక న్యాయమూ మాకొక న్యాయమా? మేమైనా పాపం చేస్తున్నామా? ఇది అనూచానంగా వస్తున్న వృధ్ధాచారము. మేము పెద్దల బాటనే నడుస్తున్నాము. దీన్ని పాపమంటావా?
విష్ణు సేవకుడూ మిత్రుడూనైన గరుత్మంతుడు తనకు అమృత భాండం లభించినా దాన్ని తీసికెళ్ళి దేవతలకిచ్చాడు .తనకు ఆహారంగా సర్పాలను వరంగా ఇవ్వమని వేడుకొన్నాడు. అంటే ఏ జాతికి చెందిన ఆహారమైనా‌ ఆ జాతికి అది అమృతం కన్నా ఆధికమే కదా! ( తెలుగువారికి ఆవకాయ గొంగూరలా).
నిద్రాహారాదులను మాని నేను కష్టపడి చదివినందువల్ల నాకు లాభమేమొచ్చింది ? బ్రహ్మ రాక్షస జన్మ తప్ప. ఈ చదువుల్లో వున్న శుష్క వాదాల్లోని అసత్యాలను నమ్మి ఎవరు మోసపోతారు? చెప్పు. నీకు తెలిసిన శాస్త్రవిషయాలను నాతో ముచ్చటించడం వల్ల నేను మెచ్చుకొంటాననుకొంటే అది వట్టీ భ్రమే.
ఈ చదివిన కూర వింతగా మాబాగా వుంది.ఇంకాస్తా తెచ్చిపెట్టండని అంటాను.ఆని మెప్పు నీకు వస్తుంది సుమా!" అని బ్రహ్మరాక్షసుడు నాస్తిక వాదాన్ని అవలంబించాడు.
తాను పలికిన ధర్మసంగతమైన వాక్యాలను కుతర్కంతో హేళన చేశాడు. ఆ నిందారోపణలను వినలేక కృష్ణకృష్ణా యని కృష్ణస్మరణ చేశాడు.తన అంత రంగంలో నీటికి నాచు తెగలు మాటకు మాట తెగులు వీనిని కదిపితే మనకు మానక్షోభమే తప్ప ప్రయోజనం లేదని భావించాడు. ముందు చేయవలసిన కార్యం ముఖ్యమని భావించిన వాడై‌ వీని సామోపాయముతో చక్కదిద్ది తన మార్గం సుగమమం చేసుకొందాము.ఇతనికి ప్రీతి కలిగిద్దామని అనుకొన్నాడు.అందుకే బుధ్ధునకున్న సర్వజ్ఞుడని పేరుతో ఇలా అంటున్నాడు(,, సర్వజ్ఞః సుగతోబుధ్ధః- అని అమరం) .
నీవు సర్వజ్ఞుడవు! అన్నీ తెలిసిన వాడవు. నేనా సామాన్య మానవుడను పైగా హీన జన్మ కలవాడను.పైగా పెద్దగా శాస్త్రాలు చదివిన వాడను కాను ,కావున నీతో వాదించ గలనా? నాకు అంతటి శక్తి లేదు. నా ప్రార్థనను మన్నించుము.
నీవు రాక్షకులములో‌ప్రసిధ్ధుడవు. అలాంటి నిన్ను ఏవిధంగా మెప్పించ గలను.? 
ప్రస్తుతం నేను ఒక్క వ్రతం చేస్తున్నాను. నీవే. ఆ వ్రతాన్ని సఫలం చేయగలవు. ఎందుకంటే 
"సఖ్యం సాప్త పదీన ముచ్యతే "అనే పెద్దల మాటను గుర్తుకు తెచ్చుకొనుము. ఏడు అడుగులు కలసి నడిచినా,ఏడు మాటలతో సంభాషించినా మిత్రత్వం ఏర్పడుతుంది.
ఇక్కడికి దగ్గరలో కురుంగడీ అనే దివ్య దేశం వుంది. ఆ క్షేత్రంలో వెలసిన వామన స్వామిని ప్రతినిత్యం కీర్తించి రావడం ఆ వ్రతం.నేటితో ఆ వ్రతం పూర్తవుతుంది.
ఆ వ్రతం పూర్తి చేయించడం నీచేతిలో వుంది"
అని చెబుతున్న మాటలను విని చిరునవ్వు నవ్వుతూ అతడిని సమీపించి విష్ణుభక్తుని చెక్కిలిపై చిటికేసి " భలే రక్తి కట్టించావోయి కథను."అని ఎగతాళిచేశాడు. "ఈ అడవిలో మొన్నటిదాక తిరుగుతూ బాటసారులను కొట్టీ తన్నీ, దోపిడి చేసి తెగబలిశావు. ఇప్పుడేమో వైరాగ్య మొచ్చి విష్ణు భక్తుడవైయ్యావు. బాగా చదువుకొన్న నన్నే మతిహీనుడుగా భావించి నిన్ను బంధించిన తాడును తెంపుకుపోవాలని ప్రయత్నిస్తున్నావు. ఓ విష్ణుభక్తుడా ! భళీ ! నీ తెలివితేటలకు మొచ్చానురా!
ఓ మూర్ఖుడా! ఇటువంటి నీతిబోధనలను విని నోటిదాకా వచ్చిన కూడును వద్దనే వాడైవడైన ఎక్కడైనా ఉన్నాడా? చెప్పిన మాటలకు కట్టుబడి తన దేహాన్ని అర్పించే వాడు ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడా? నేను నిన్ను వెళ్ళనివ్వడమూ సరే! నీవు తిరిగి రావడమూ సరే! ఇవేవి జరిగే పనులు కావు. ఈ దుఃఖాలు వగలమారి ఏడ్పులు కట్టి పెట్టు" అని రాక్షసుడు విష్ణుభక్తునితో అన్నాడు.
బ్రహ్మ రాక్షసుడు పలికిన ఈ కర్ణకఠోరమైన వాక్యాలను వినలేక హరి హరీ! అంటు విష్ణు మూర్తిని స్మరించాడు. " ఓ పిశితాసి! నన్ను నమ్ము. నేను తప్పక వస్తా" నంటూ అనేక ప్రతిజ్ఞలు చేశినా రాక్షసుడు నమ్మలేదు.వినిపించుకోలేదు.
చివరకు ఎవడి చూపువలన సృష్టి జరుగుతుందో! ఆసృష్టి ఎవడిలో నివసిస్తుందో ,చిట్ట చివరకు ఈ సృష్టి ఎవరిలో లయమౌతుందో ,అటువంటి మహావిష్ణవును అన్య దైవతములతో పోల్చిన వాడు ఏ మహాపాపానికి పోతాడో ,అంతటి పాపాన్ని పొందుతాను."అనిచేసిన భీషణ ప్రతిజ్ఞను. విని బ్రహ్మ రాక్షసుడు అతని కట్లను విడదీసి పంపాడు. ఎంతటి భయంకరమైన బ్రహ్మరాక్షసుడైనా ఎంతటి కఠినాత్ముడైనా అతనిలో ఏమూలో దివ్యత్వం చిన్న దివ్వెలోని కాంతివోలె మిణుకుమిణకు మంటున్నదని ఈ ఘట్టం గుర్తుకు తెస్తుంది.ఆ విషయాన్ని కృష్ణారాయలు చాలా ఆర్ద్రంగా వర్ణించాడు.
[ ఈ పద్యంలో రెండు పాదాల
" ఎవ్వని చూడ్కిచేసి జనియించు జగంబు వసించు నిజ్జగం
బెవ్వనియందు దిండు మరి యెవ్వని యందిది" అన్న పంక్తులు" బమ్మెర పోతనా మాత్య విరచిత శ్రీ మదాంధ్ర మహాభాగవతం గజేంద్ర మోక్ష ఘట్టంలో ని " ఎవ్వనిచే జగము " అని పద్యాన్ని గుర్తుకు తెస్తున్నాయి. దీని వల్ల విజయనగర రాజుల కాలంలోనే తెలుగు భాగవతం సుప్రసిద్ధమై పోయింది అని ఆనందం కలుగుతుంది] .
పూర్వజన్నలో చేసిన చిన్న పాపము వల్ల ఈ రాక్షసుని చేతిలో పడ్డాను. ఇలా ఆ పాపం ఈ కొద్దిపాటి బాధతో తీరిపోయింది. అని అనుకొని రాక్షసుని చెరనుండి విముక్తుడై కురుంగడి ఆలయానికి త్వరగా చేరుకొన్నాడు. తన యిష్టదైవానికి సాష్టంగ ప్రణామం సమర్పించి , తన వదదనున్న తంబూరను మీటుతూ గానములో లీనమైపోయి దివ్య స్తోత్ర ప్రబంధాలను గానం చేశాడు.ఆలస్యం చేస్తే అసత్య శంక వస్తుందనే భయం వోక ప్రక్క బాధ పెడుతున్నా ,తాను సంకల్పించిన వ్రతమును పూర్తిచేసుకొని రాక్షసుని వద్దకు వచ్చి ఇలా అన్నాడు.
ఓ నిశాచరా! నీవు నన్ను విడిచి పెట్టాక , నేను నేరుగా శ్రీమహావిష్ణువును సేవించుకొని వచ్చాను. నాకు ముక్తి లభించింది. ఇంకనేను ఏ బంధములలోను చిక్కుకోను.నీవు నన్ను కోవెలకు పంపినపుడున్న పాదాలు,పొట్ట, రొమ్ము,తల, చేతులు మొదులైన అవయవాలు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయు.కావలంటే పరిశీలించి చూచుకో! "అన్నాడు విష్ణభక్తుడు. అలా మాలాసరి సంభాషిస్తుండగానే , మాలదాసరి సత్యవాక్య పాలనకు బ్రహ్మరాక్షసుడు ఒక్క సారి కదిలిపోయాడు.అతని నేత్రాలనుంచి అశ్రుధారలు కాలువలు కట్టాయి. అతని నిజయాతికి నిర్భయత్వానికి పులకించిపోయాడు.[ సగంమాత్రమే జుట్టున్న బ్రహ్మరాక్షసుని బట్టతల మధ్యాహ్నపు ఎండలో తళతళా మెరసిపోతుంది].
తరువాత విష్ణభక్తుని సమీపించి కొండలాంటి తనశరీరాన్ని భక్తితో కాస్తా వంచి, విష్ణభక్తునకు ప్రదక్షణలు చేశాడు. జబ్బుపడ్డ పెద్ద యేనుగు చెట్టు చుట్టు గిరగిరా తిరిగి తటాలున పడిపోయినట్లుగా విష్ణుభక్తుని పాదాలకు సాష్టంగ నమస్కారం చేశాడు.అతని కాళ్ళకు తలను తాకించి పర్వతాలు ప్రతిధ్వనించేలా అతనిని కీర్తించాడు. విష్ణుభక్తుని పాదాలను తనకోరలతో మెల్లగా పైకెత్తి తలపై పెట్టుకొన్నాడు.
అతడు"భూమి మీద నీలా సత్యవ్రతాన్ని పాటించే వాళ్ళులేరు.దేవతలు మునులు రాజన్యులు వారందరి వాక్కులు వారితపస్సంపద పలువిషయాల్లో గొప్పవి కావచ్చు. కానీ నీవు పాటించిన సత్యనియతి చాలా గొప్పది. నాకు ముసలితనం వచ్చి చాలా కాలమైనది.(బ్రహ్మ రాక్షసులకు ముదిమి వస్తుందేమో) .ఇప్పటిదాకా నీలా సత్యవ్రతాన్ని పాటించిన వారిని చూడలేదని ఘంఠాపథంగా చెప్పగలను. ఇతరులు ఎవరు నీగుణాలతో సాటిరాగలవారు ఎవరూ లేరు. ఈ ధైర్యం, ఈ జ్ఞానం, ఈ ధార్మికత, నీ పవిత్రజీవనం ,నీ విష్ణుపాదసేవాభక్థి మొదులైన ఊత్తమగుణాలన్నీ ఆ స్వామినీకు ఆధారమై నిలవడం వల్లె వచ్చాయి. నుదగ్గరున్న సొరకాయ తంబూరాను చిన్న నావగా చేసుకొని కైశికీ గానంతో సంసార సాగరాన్ని దాటేశావు..నీ గాన మాధుర్యంతో కురుంగడి క్షేత్ర స్వామిని కట్టి పడేశావు.
అని బ్రహ్మ రాక్షసుడనగానే మాలదాసరి బ్రహ్మరాక్షసుని సమీపించి ,అతనిని కౌగలించుకొని 
"ఓ రాక్షసోత్తమా! నీవు పాపవిముక్తుడవయ్యావు. నా వ్రతాన్ని సుసంపన్నం చేయించావు. నీదయవల్లనే కదా ! నేను ధన్యుడనయ్యాను.
ఓ బ్రహ్మరాక్షసోత్తమా! నీవు భూసురవంశ పుణ్యజనుడవు.(రాక్షసులకు పుణ్యజనులని పేరు ప్రసిధ్ధము). పుణ్యజన శబ్దము నీయందు సార్థకమైనది. ప్రాణ భయముతో చేసే ప్రతిజ్ఞలు చాలా వుంటాయి. అవి బండిచక్రములోని ఆకులుగా పైకీ క్రిందికి తిరుగుతుంటాయి.
అవి అటుండనీ. కష్టపడి సాధించిన ఆహారాన్ని వదులుకోవడం సాధ్యమా? నీవు ఆపనిచేయగలిగావు. నీవు చేసిన ఈ కార్యంవల్ల మిగిలిన రాక్షస సమూహమంతా పుణ్యాన్ని మూటకట్టుకొన్నది.
బ్రహ్మదేవుడు మమ్ములను మీకు ఆహారం గానియమించాడు.నీవు ఆకలితో నకనకలాడుతున్నా కూడా నేను వ్రతమాచరించడానికి వీలుగా నన్ను వదిలి పెట్టావు. ఇప్పుడు నాశరీరాన్ని హాయిగా భుజించి నీ ఆకలి తీర్చుకో. ఇదే నామీద ఒట్టు. ఇఃదువల్ల నీకు ఏ పాపమూ రాదు.
దేవతావైరివైన ఓ రాక్ష సా! నేను ఇప్పుడు చెప్పిన మాటల్లో ఏపొరపొచ్చాలూ లేవు.నేను మనస్ఫూర్తిగా చెపుతున్నాను.ఇందుకు ఈశ్వరుడే సాక్షి. నాశరీరంలోని మెదడును కొవ్వెక్కిన నా మాఃసాన్ని నీ ఆకలి తీరిపోయేట్లుగా తృప్తిగా తినే"ది అని అన్నాడు విష్ణభక్తుడు ఇలా అనగా బ్రహ్మరాక్షసుడు జాలి గొలిపె స్వరముతో " ఈ విధంగా నీవు మాట్లాడటం న్యాయంగా వుందా? నేను నీ దయకు పాత్రుడను కానా? ఇన్నాళ్ళు ఈ పాడు పొట్టకు ఇటువంటి ఆహారాన్ని తిని కడుపు నింపుకొన్నాను. ఎప్పటికైనా ఒక తపస్వి, ఒక వ్రతనిష్టుడు వచ్చి నాపై దయ చూపడా ? అని ఆతృతతో ఎదురు చూస్తున్నాను . ఇన్నాళ్ళకు నీవు వచ్చావు. ఎదో నీదయ వల్ల ఈ పాపిష్టి జన్మను చాలించి తరిద్దామనుకొన్నాను.ఇటువంటి తరుణంలో నీవు ఇలా మాట్లాడటం న్యాయమేనా? నీవే ఇలాంటి మాటలు అనవచ్చా? మీలాంటి పరమభాగవతోత్తములు మాలాంటి వారిపై దయచూపకపోతే మాగతి ఏమౌతుంది? నా పూర్వపు బ్రతుకు పై అసహ్యించుకోకుండా నాపై దయ చూపు" అని బ్రహ్మరాక్షసుడు వేడుకొన్నాడు. ఇలా అంటూ తన వాక్యాలను సమర్థించుకుంటా ఇలాచక్కని పోలికను చెపుతున్నాడు.
దేవేంద్రుడు ధరించే పవిత్రమైన వజ్రాయుధాన్నైనా, బ్రహ్మ హత్యం చేసిన నీచమైన కత్తినైనా పరుసవేది బంగారు గా మారుస్తుంది.ఇవి రెండు వాటి స్థాయులు వైరైనా పరుసవేది కి సమానం. అలానే మాలాంటి వారిని సముధ్ధరించడానికి నీవు పరుసవేదిన్యాయముశ లాంటి అధ్బుత మైన న్యాయాన్ని నీవు అనుసరించాలి" అని రాక్షసుడు అన్నాడు. రక్కసుని మాటలు విన్న విష్ణుభక్తుడు "నాశరీరత్యాగాన్ని నిరాకరిస్తున్నారు.పైగా దీనంగా రాక్షస జన్మనుంచి విముక్తము చేయమని వేడుకొంటున్నావు. నాదేహత్యాగం నీపై దయచూపడం కాదు "అని అన్నాడు.వెంటనే రాక్షసుడు "నా పాపాన్ని పొగొట్టుకొనే నాకు చూపడమే కావలసినది.ఘంటా కర్ణుడ నే రాక్షసుడు మునీంద్రులనే తినేశాడు.నేను అతడు చేసిన పాపాలకన్నా నా పాపాలు భయంకమైనవా? అలాంటి దుర్మార్గులకు కూడా ఈశ్వరుడు మోక్షాన్ని ప్రసాదించాడుకదా! పరమభాగవతతోత్తముడైన నీవు నాకు అటువంటి దయామృతాన్ని ప్రసాదించలేవా? ప్రాణులను రక్షించడం వాటిని ఉద్ధరించడం అనేవి భగవత్సేవలేకదా! "
బ్రహ్మరాక్షసుని వేదనా భరితమైన వాక్యాలను విని విష్ణుభక్తుడు ఇలా ఎలా జరుగుతుందని ప్రశ్నించగా " నేను కుంభజానుడనే బ్రహ్మరాక్షసుడను.అనేక భయంకరమైన పాపాలను చేశాను.ఈ మర్రి చెట్టును ఆశ్రయించి బ్రతుకుతున్నాను. ఈ దారిలో వచ్చే బాటసారులను చంపితింటున్నాను. పూర్వజన్మలో నేనొక బ్రాహ్మణుడను, అప్పుడు నాపేరు సోమశేఖర శర్మ.నేను ద్విజుడను కావున దయకు పాత్రుడను. పాపకర్మల ఫలితంగా నాకు ఈ జన్మ సంప్రాప్తించింది. నీవు శ్రీహరి నికీర్తించి జలధార పూర్వకంగా నన్ను పవిత్రుడను చేసినప్పుడు ఈ జన్మ తరిస్తుంది. నావంటి బాధితులను కాపాడితే నీకు అనంతమైన పుణ్యం లభిస్తుంది. ధర్మ సాధన మైన ఈ తనువు ఇల్లుచేరుతుంది. [ ఇల్లు చేరడంలో ఉన్న చమత్కారం శాపవిముక్తి కలిగి ఇంటికి చేరుతాను అన్నది సామాన్యార్థ మైతే ,నేను స్వస్థానానికి అంటే వైకుంఠానికి చేరుతాను ,ముక్తిని పొందుతాను‌అన్నది వ్యంగార్థము]
రాక్షసుని మాటలు విన్న విష్ణుభక్తుడు "నేనుకూడా నీవలనే ఎక్కువో తక్కువో యైన యెన్నో జన్మలు పొందలేదా! ఈ జన్మ కూడా ఆపరంపరలోనిదే కదా! ఈ జన్మ. జీవితం క్షణభంగురం.ఇటువంటి జీవితం కోసం ఎన్నో నియమనిష్టలతో సంపాదించుకొన్న పుణ్య ఫలాన్ని నీకు ఎలా ఇవ్వమంటావు.
నీవూనేను గతజన్మలో దిక్పాలురుగా జన్మించి మరుజన్మలో యాచకులు గా ఎన్ని సార్లు జన్మించలేదు.
నీవు నేను గత జన్మల్లో సింహాలు గా జన్మించి మరుజన్మలో అల్పమైన క్రిమికీటకాలుగా పుట్టలేదా!
నీవు నేను గతజన్మల్లో ఏనుగులుగాళజన్మించి మరుసటి జన్మల్లో దోమలు గా పుట్టలేదా!
నీవు నేను గతజన్మల్లో రాజులుగా జన్మించి మరుజన్మలో సేవకులుగా పుట్టలేదా!
ఎన్నో జన్మల్లో సోమయాజులు గా జన్మించి మరుసటి జన్మల్లో కుక్క మాంసం తినే శ్వపచులుగా జన్మించ లేదా! ఇంకా మరెన్నో జన్మల్లో పశువులుగా పక్షుల్లా పాములు గా పుట్టలేదా! కాని గతజన్మల్లో కృష్ణభక్తులుగా పుట్టలేదు. తక్కిన జన్మలు ఎన్నో ఎత్తుతూ నే ఉన్నాము.
ఈ శరీరము నశ్వరమైనది.చేపల బుట్టలో నీరు లాంటిది. ,(చిల్లులు న్న బుట్టలో నీరు త్వరగా కారిపోయినట్టు ప్రాణం పోవచ్చు)
సాలెపురుగు తన దారాలతో కట్టిన మూటలాంటిది(ఆ దారం ఏక్షణంలో తటాలున తెగుతుందో అలానే ప్రాణం పౌవచ్చు).ఎండాకాలంలో గాలికి ఆరబెట్టిన పత్తి లాంటిది ఈ ప్రాణం.(అంటే దేహం నుంచి పంచ ప్రాణాలు ఎప్పుడుకొట్టుకు పోతాయో తెలియదు).
ఈ ప్రాణం ఎండలో ఆరబెట్టిన పసుపులాంటిది. తొర్రి పళ్ళ వాని అస్పష్ట మైనపలుకులాంటిది ఈ ప్రాణం. ఇటువంటి శరీరం పై వ్యామోహంతో శ్రీమహావిష్ణు సేవాకైంకర్య ఫలాన్ని అమ్ముకౌవడం పచ్చ కర్పూరాన్ని ఇచ్చి ఉప్పుకొనటంలాంటి అవివేకమైన వ్యవహారము.అని నిక్కచ్చిగా మాలదాసరి పలికాడుఅందుకు బ్రహ్మరాక్షసుడు " ఓ విష్ణుభక్తుడా ! నీవు భక్తితో సంపాదించుకొన్న కైశికీ గాన ఫలంలొ దయచేసి సగమైనా ఇవ్వరాదా? చేపతాగిన గ్రుక్కెడు నీరు వల్ల సముద్రంలో నీరేమైనా తగ్గుతుందా? ఆ.లాగే నన్నుతరింపచేసినందువల్ల నీవు గానం చేసి ఆర్జించిన పుణ్యఫలం ఏమైనా తరిగిపోతుందా? అని అన్నాడు.
అందుకు మాలదాసరి " నీ ఆత్మోధ్ధరణ విషయాన్ని అడగి నిన్ను బాధించ వద్దు. నేను నీకు నా శరీరాన్ని అప్పగిస్తానని మాట యిచ్చానే కానీ , పుణ్య ఫలాన్ని యిస్తానని చెప్పలేదు కదా! అది కూడా నీవు అడిగిందే కదా! ఈ పాతాళ ప్రశ్నలు[ పాతాళంలో దిగి ఆలోచిస్తెగాని సమాధానం దొరకని ప్రశ్నలు] మానేసి ,నన్ను తిని నీ ఆకలిని తీర్చుకో! మారు మాటలు చెప్పి నన్ను మోసం చేయకు. నీ వ్యవహారం ఎలా వుందంటే నుయ్యి తవ్వడానికి ప్రయత్నిస్తే ,దెయ్యాలు పుట్టాయని సామెతలాగా వుంది.ఇక అటువంటి మాటలు చెప్పక" మన్నాడు విష్ణుభక్తుడు.
ఇలా నిష్కర్షగా పలికిన విష్ణుభక్తుని మాటలు విన్న కుంభజానుడు మిక్కిలి దుఃఖించాడు.వచ్చే కన్నీటిని ఆపుకొని ,ఏవిధంగా నైనా విష్ణుభక్తుని ఒప్పించి ,మోక్షాపాయాన్ని పొందాలని అనుకొన్నాడు.
అతనితో" అయ్యయ్యో! కటకటాల! కైటభారికిష్టులైన విష్ణుభక్తులు పరమదయాళువులు కావలదా!
 విశిష్టాద్వైత మతస్థాపకులు భగవద్రామానుజులు మూర్తీభవించిన దయాస్వరూపులు. వారు తమగురువులైన శ్రీశైల పూర్ణులకు మిక్కిలి శ్రద్ధాభక్తులతో సేవలు చేయడం వల్ల వారి అనుగ్రహానికి పాత్రులైనారు.




 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత