జోగులాంబ

యోగులందరితల్లియోగీశ్వరీదేవి
జోగులంబావమ్మ జగతికంత
పదనెనిమిదలోన ప్రఖ్యాతి చెందిన
జగదాంబ నీవమ్మ జయమునిమ్ము
భవాభ్ధిదాటింప భవ్యమౌ నావవు
భక్తాళిరక్షించు భధ్రమూర్తి
భీకరాకృతియంత పైపైన నీకున్న
మనసులో మాత్రమ్ము మార్దవమ్మె
సర్వశుభములిచ్చుశాంకరివీవమ్మ
ఆదివిద్యయనుచునఖిలసురలు
ప్రస్తుతింతురునిన్నుపరమార్థదృష్టితో
వేడవలయునన్న వేడ్కకలదు
శరదృతువందున చంద్రోదయమట్లు
ఆనందమందించునమ్మవమ్మ
ఆ‌.వె
హరికిచెల్లివమ్మ హవ్యవాహనమూర్తి
ప్రణతజనులకెల్ల పాలిదిక్కు
సీధ్ధినొసగుతల్లి శ్రీమాత నీవమ్మ
వందనాలువేలవందనాలు
(రచన:-విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత