నందగోపతనయ
నందగోపతనయ నవ్వుమరుచుటేల
మూతిముడుచుకొనెడు ముచ్చటేల
అల్ల రాపమన్న యలుకబూనతగునె
వెన్న యిత్తు మింక విసుగు మాను
పూతనేమిచేసెపూర్వంపు భవమందు
తల్లియాయె కొంత తడవు
పాలతోడకూడ పాపాలు పీల్చేసి
ముక్తినొసగినట్ఝి మోహనుండ
బండిరక్కసుండు బ్రతిమాలవదలక
చావగొట్టినావు చెవులు మూసి
పుణ్యజనునికాస్త పుణ్యంపు త్రోవలో
మళ్ళజేసినావు మమత జూపి
రోటకట్టెననుచురోషంబుపూనుచూ
తరువులంచగూల్చ తక్షణంబె
ధమదుపుత్రలంత ధన్యులైనారుగా
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి