కార్తీకమాసం పరమేశ్వరుడు

శిరముపై శశిరేఖ శిగలోన గంగమ్మ
తనువులో సగ మంబ మనసు హరిది
గళసీమ గరళంబు గజచర్మ వసనంబు
భస్మత్రి ప్రుండంపు భవ్య మూర్తి
ఢమఢమ ధ్వనులతో ఢక్కానినాదంబు
బ్రహ్మమే వాక్కుగా పరిణమించె
బ్రహ్మండ మంతయూ భవ్యమౌ మూర్తిగా
తాండవంబాడగా తన్మయంబు
చిరునవ్వు చిందించు చిన్మయ మూర్తిగా 
అరమోడ్పు కన్నుల హరడు వీవు
నాగు లన్ని నీకు నాణ్యంపు నగలాయె
విశ్వ మంత నీకు విడిడి యిల్లు
భక్త జనుల మదియె భద్రంపు సదనమ్ము
నమ్మి నాము మేము నయము గాను
(రచన:-, విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత