శిలిగ్రామ పావనత

వైకుంఠ వాసుండు వరమీయ వేడ్కతో
గండకీ తీరాన కొలువుతీరె
సాలిగ్రొమ పూజయె జన్మసాఫల్యంబు
కావించు ఘనమైన కార్యమయ్య
సాలిగ్రామతోయంబుసమసింఫజేయను
అఘములన్నిటినంత నణచి వేసి
కానికాలమునందు కాలుండు కొనినీక
కాపాడు నట్టిదౌ కవచ మయ్య
ఆ.వే.సకల వ్యాధి లెల్ల సంహార మౌనట్టి
దివ్య తీర్థ మిదియె భువిని కలదు
ఆ.వే.అఃద జేసె మనకు నాదిశంకరుడంథ
ఆచరించ వలయు నార్యులార!
రచన:-విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత