అవిముక్త నగరము
అవిముక్త నగరమా! నధ్భుతంబాయెగా
నినుబోలు నగరమ్ము నిలను గలదె
ఆనందవనమంత నందాల నిలయమై
వసుధలో నిలిచెగా వారణాసి
విశ్వేసు నిలయమై విభుదేంద్ర వంద్యమై
విఖ్యాతి గాంచెను వారణాసి
మాహేశు నిలయమై మహితస్మశానమై
ముక్తికే నిలయమై మురిసెకాశి
ఆ.వే.కాశీ యనుచు జనులు నాశతో యరుదెంచ
ఆన్నపూర్ణతల్లి యాదరించు
పెద్ధ కనుల తల్లి ప్రేమతో దీవించు
కనులపండు వగును కాంక్షతీరు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి