కపి కార్తీకం

కార్తీకమాసాన కావించు స్నానాలు
మాకేలలేదంచు మార్కటాలు
అఘమర్షనంబునకనుకూలమిదియించు
దంపతీసహితంగ నదినిముణిగె
సంకల్పసహితమౌ సరిగంగ తానంబు
పూర్వంపు పుణ్యాన పూర్తియౌను
మాకేమొ రాదాయెమంత్రంబు తంత్రము
చేయించువారంత చెంతలేరు
భావమొకటియున్నపదివేలెయనునట్టి
మారుతాత్మజుడంతమాకుచెప్పె
ప్రారభ్దకర్మాన ప్రాప్తించు జన్మము
శివునాజ్ఞ నేదియె శివునకెరుక
అనుచుతలచునేమొయహరహమ్మీరీతి
కపులతలపులిట్లు గడిచెనేమొ
నదినిమునగతలచు మర్మమేమొ
కారణంబులేక కార్యమెట్లు జరుగు
తత్త్వమరయనేమొతపసియంత
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజు శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత