వీధి బాలుడు

వ్యర్థమైన సరుకు వసుధలో లేదంచు
నిత్యజీవితాన నెముకునితడు
అమ్మనాన్నలెవరొ యాత్మీయులెవరో
సుంతతెలియనట్టి శుధ్ధుడితడు
మొండిధైర్యమంత మోములో కన్పట్టు
బ్రతుకు సమరమందు పారిపోడు
కన్నులందు వెదుక కాపట్యమేలేని
వీధిబాలుడైన వీరవరుడు
వీధియితినికాయె విద్యాలయమిపుడు
బ్రతుకు పాటమింక పట్టుబడును
తనకుతానెగురువు తగవుతీర్చగలగు
యోగ్యతున్న యట్టియోగ్యుడితడు
బాలకార్మికంబు భారతావనిలోన
సమసిపోయెననుచు చాటగలగు
ముఖ్యనేతలెపుడు మోదంబుతోపల్క
ఇప్పుడితడుతేలె యేదినిజము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత