మర్కటవైరాగ్యం
ఎచటినుండిరాక యెటునేగవలయును
ముందుజన్మలెన్నొ మునుపులెన్నొ
పరమసత్యమేదొ పరమార్థమేదియె
ఎరుకలేకపోయె యేమి బ్రతుకొ
ఆలుబిడ్డలనుచుననురాగమనుచును
పగటికలలతోడి బ్రతుకు గడిచె
ఎండమావులనుచుయెరుకలేకతిరిగి
మోసపోతినకటమోహమంద
గురువు వద్ద జేరి గుప్తమౌ జ్ఞానమ్ము
అందుకొనగనట్టియాశ మిగిలె
జన్మసఫలమందు సరియైనమార్గమ్ము
గురువుచెంత జేరకోర్కెమిగిలె
మర్కటానికైన మనిషికైననుకూడ
మనసు నుండుననుచు మరవనేల
జన్మలెత్తునట్టి జాడ్యంబు సహజమ్ము
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి