స్వార్జిత విత్తము

స్వార్జిత విత్తమ్ము సర్వోన్నతంబౌను
సంతోషమిచ్చును సత్యమింతె
మధ్యంబెయగునోయి మరిపితృవిత్తమ్ము
నీగొప్పెమికలదు నిజముగాను
అన్నదమ్ములపైనియాధారపడుటంత
అధ్వాన్న మౌనింక యసలు నీకు
వరకట్నమనుపేర వనితధనముకోర
వ్యర్థంపు బ్రతుకోయి వసుధ లోన
ఆ.వె.ఆర్జవంబెనీకు నాధారమగునోయి
కష్టపడిన సుఖము కలుగు నీకు
కార్యకుశలతంత కర్మయోగంబౌను
నాగరాజమాట నమ్ము మింక
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత