ఎడడ

ఎడదకన్న మంచియెరువులేదు
ప్రేమబీజమేయ ప్రేమయేమొలకెత్తు
ద్వేషబీజమేయ ద్వేషంపు దిగుమతే
భయమునాటునావొ భయము పెరుగునోయి
ఆశవిత్తువేయయాశయే మొలకెత్తు
ఈశువిత్తువేయ యీర్ష్యాళువగునోయి
పగునునాటిచూడ ప్రబలమౌ పగలౌను
ఏదినాటవలయొ యెరుకచేసుకొనిన
మనసురైతవైన మరిబాదలేదింక
(ఛందస్సు కు సంబందించిన కవిత కాదు)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత