పరమేశ్వరత్వము

శిరముపై శశిరేఖ శిగలోన గంగమ్మ
తనవులో సగమంబ మనసుహరిది
గళసీమ గరళంబు గజచర్మ వసనంబు
భస్మత్రిపుండ్రపు.భవ్యమూర్తి
డమడమ ధ్వనులతో డక్కానినాదంబు
బ్రహ్మమే వాక్కుగా పరిణమించె
బ్రహ్మండమంతట ప్రకటమౌరీతిగా
తాండవంబాడగ.తత్పరుండు
చిరునవ్వుచిందించు చిన్మయమూర్తిగా
అరమోడ్పు కన్నుల నందగాడు
నాగులన్నియునీకు నాణ్యంపు నగలాయె
ఆ.వే.విశ్వమంతయునీకు విడిది యిల్లు
భక్తజనుల మదియె యుక్తమౌ సదనమ్ము
శివుని లీల లోన చిత్రమిదియె
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)శిరముపై శశిరేఖ శిగలోన గంగమ్మ
తనవులో సగమంబ మనసుహరిది
గళసీమ గరళంబు గజచర్మ వసనంబు
భస్మత్రిపుండ్రపు.భవ్యమూర్తి
డమడమ ధ్వనులతో డక్కానినాదంబు
బ్రహ్మమే వాక్కుగా పరిణమించె
బ్రహ్మండమంతట ప్రకటమౌరీతిగా
తాండవంబాడగ.తత్పరుండు
చిరునవ్వుచిందించు చిన్మయమూర్తిగా
అరమోడ్పు కన్నుల నందగాడు
నాగులన్నియునీకు నాణ్యంపు నగలాయె
ఆ.వే.విశ్వమంతయునీకు విడిది యిల్లు
భక్తజనుల మదియె యుక్తమౌ సదనమ్ము
శివుని లీల లోన చిత్రమిదియె
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత