బెజవాడ దుర్గమ్మ

బెజవాడ దుర్గమ్మ బెబ్బులిపైనెక్కి
భక్తాళికెల్లను భధ్రమొసగ
చిరునవ్వుచిందించుశ్రీమాత చూడగా
కష్లాలుకడగళ్ళుగాలికలియు
దుర్గమాసురునంతదునుమాడిదుర్గమ్మ
మమ్మంతకాపాడుమాతృమూర్తి
ఇంద్రకీలాద్రిపై యిందుధరునికూడి
జగమేలుచున్నట్టిజననియామె
నవరాత్రులందునునవదుర్గయైతాను
కరుణించికాపాడుకన్నతల్లి
అమ్మలగన్నట్టియమ్మయైనీవింక
చిరునవ్వు నవ్విన చింతదీరు
మమతానురాగాల మమ్మంత పోషించు
కారుణ్యమూర్తియౌకనక దుర్గ
వందనమ్మలివియెవాత్సల్యమూర్తికి
ఆదరించవమ్మయాదరాన
నిన్నునమ్మినామునీకన్నదిక్కేది
నతిశతములులివియె నమ్మవమ్మ
(రచన:-విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత