ఆత్మశక్తి
ఆత్మశక్తి యొకటి యంతయుమార్చును
చింతపడకురోయి చిన్నవాడ
నీలోన కలయట్టి నీశక్తియంతయు
నిద్రాణ మైపోయి నిద్ర చెందె
తట్టిలేపవలయు తధిగిణ తోమ్మంచు
ఆడించగలదోయి యాత్మశక్తి
పుట్టుపాపియనుచు పొర్లిపొర్లి యేడువ
ఫలమేమికలుగును పాప మొకటి
ఆస్తిక్య భావమే నమితమౌ శక్తిగా
ఎదురేమిలేదంచు యెరుక సేయి
ఆ.వే.వేదమంత మనకు వేద్యంబు చేసిన
మహిత శక్తి యంత మరువ రాదు
కల్ప వృక్ష మంత కనులముందుండుగా
ఆక లంచు నీవు కేక మేలె
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి