నటరాజు నర్తన

చిరునవ్వుచిందించి చెలితోడ నాటాడు
అరమోడ్పు కన్నుల అందగాడు
నీలంపు మెడతోడ నీటైన సొగకాడు
ఎత్తైన యెద్దుపై యెక్కితిరుగు
మూడుకన్నులరేడు ముల్లోకములనేలు
భస్మంపు పూతయే భాగ్యమనను
మారేడు దళములే మారేడు మెచ్చును
ఉమ్మెత్త పూవులె నుచిత మనను
అభిషేక జలముతో ఆనంద మందును
ఆర్క పుష్ప మంత అంద మొసగ
వెండికొండ పైన వేల్పులందరు కొల్వగా
తాండవమ్ముసేయు తపసియతడు
నవరసంబులంత నయనోత్సవమ్మనుచు
తపసులందరంత తరలినారు
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని  నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత