భూతాపం భావమ్ము
భూతాప నామంబు పూర్తిగా పోయెగా
వాతావరణమార్పు వచ్చెనేడు
ధ్వంసాని కొంకిత తగినట్టి పేరును
తగిలించినారోయి తడుముకోక
హిమనీనదములెల్ల యితిహాసమాయెగా
ధృవపుజంతువులెల్లకృపణులలాయె
పెంగ్విన్ లు బ్రతుకంత పెంజీకటాయెగా
ముద్దుముద్దు నడకలు మొద్దులాయె
తెల్లెరిపోయెగా తెల్లెల్గుబంట్లంత
హరితగృహమనియంచు నార్భాటమొక్కటి
కర్బనొధ్గారంబు గాధయొకటి
ఐరోపఖండంబువికృతత్వమందెగా
జీవఛ్ఛవములాయె జీవనదులు
పర్జన్యుడంతయు పగబట్టినట్లాయె
విడవనిజడివాన విప్లవించ
ఓడలుబండ్లాయె వీధింతనదియాయె
తిరగడానికిపుడుతిప్పలాయె
(రచన:-విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి