లేపాక్షి

విరుపణ్ణ నిర్మించె వీరభద్రు నిగుడిని
విమలసౌందర్యమ్ము వినుతి కెక్క 
లేఫాక్షి బసవన్న లేచిరంకేసిన
వైనంబు మనకింక వేద్య మగును
వేలాడు స్తంభాల వేడ్కతో నిర్మించు
శిల్పుల నిర్మాణ శైలి కనుము
భౌతిక శాస్త్రంపు మర్మమ్ము మౌనమ్ము 
ధరియించె తర్కంబు దారితప్పె
శిల్పనిర్మాణకౌశలంబొకవైపు
అందాల చిత్రాల హంగు లొదవ
ఆ.వే.విశ్వకర్మ పంప విచ్చేసి నారెమో
ఇట్టి పనితనంబు యిలను కనము
 సంభ్రమంబు నిచ్చు సంవిధా నమిదియె
కన్ను లున్న వారి కలిమి కలిమి
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత