గురుకృప
గురుకృప వలననే గుప్తమౌ జ్ఞానమ్ము
అభివ్యక్తి మగును నవనిలోన
అజ్ఞాన తిమిరాన్నియంతంబుచేయగా
జ్ఞానాగ్నిరగిలించి జ్ఞాత పరుచు
గురువు ఉండవలయును కువలయాన
గురువె బ్రహ్మమగునుగుర్తుంచుకోవయ్య
విష్ణువే గురువౌను విద్య నొసంగి
మాయమవునుకాదె మాహేశుకరుణచే
ద్వంద్వాల బ్రతుకంత ధ్వంసమగును
ఆ.వె.ఆదిగురువుమనకు యమ్మయేయగునయ్య
విద్యనొసగుతండ్రి విలువగనుము
గురువులేనిచదువు గురిలేని బాణమ్ము
మనసులోని మాట మరువకయ్య
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి