అరుణాచలం

స్మరియించినంతనే సాక్షాత్తు మోక్షమ్ము
నిచ్చేటి నిటలాక్షు నిలయమ్ము
అరుణాచలేశ్వరునగ్నిలింగమిదియె
మ్రోక్కండి మీరంత మోక్ష మంద
అచలమేలింగమైయధ్భతంబైరీతి
ఆర్చనాలందెడుహరునిలీల
నిరవధిసుఖమిచ్చు నిటలాక్షునిలయమ్ము
కైవల్యనిలయమ్ము కైలాససమమిది
మ్రొక్కిన వారికి మోక్షమబ్బు
ఆ.వె
.పంచభూతమయుడు పరమేశ్వరుడంత
రజిత గిరిని వీడి రయముతోడ
అమరులెల్లగొలువ యవనిపై విచ్చేసి
భక్తసులభుడాయె ముక్తినొసగ
(రచన:---విద్వాన్ గొల్లా పిన్ని నాగరాజు శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత