పీఠాధిపతి

పీట యున్న వాడె పీఠాధి పతియంచు
తగవు లాడు టేల తర్క మేల
పేటకొకరు కలరు పీఠాధి పతలయ్య
కాల మహిమ చేయు కార్యమిదియె

మేర మీరి నట్టి మేధావియెవరైన
మాట పడుట నిజము మహిని సుమ్ము!
యతికి కూడ తాను యుక్తియుక్తమయిన
వర్త నంబు వలయు వసుధ లోన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత