జాతీయభావన

జాతీయభావమే జాతీయ వాదంబు
జాతిజనులకెల్ల జవము నిచ్చు
జాతియవాదమే యతివాదమట్లుగా
జడిపించతగదోయి చవటరీతి
వేలాది యేళ్ళుగా వేదాలు శాస్త్రాలు
మానవాళికినెల్ల మార్గ మిచ్చె
సంస్కృతి సభ్యతా సంస్కారములనెల్ల
ఇతిహాస సహితమై యింపు నింపె
ఆ.వే. భాగ్య మనగ నాదె భరతాంబ బిడ్డను
అమ్మ వడిని బోలు నవని యంత
దేశభక్తితోడ దేహంబు ప్రాణంబు
ధన్యమగును కాదె.నాదు జన్మ
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత