హాటకము ఆభూషణము

హాటకంబుయొకటె యాభూషణాలెన్నొ
భాండరాశులెన్నొమట్టియొకటె
ఆలమందలెన్నొపాలరంగుయొకటె
పరమతత్త్వమొకటె ప్రాణులెన్నొ

❗ శ్లోకం ❗

*||మృత్పిండ ఏకో బహుభాండరూపం*||
*|| సువర్ణ మేకం బహుభూషణాని||*
*||గోక్షీర మేకం బహుధేన జాతం||*
 *||ఏకః పరాత్మ బహుదేహ వర్తి:||*

కుండలు ఎన్ని ఆకారాల్లో ఉన్నా మట్టి ఒక్కటే!!..నగలు ఎన్ని ఆకారాల్లో ఉన్నా బంగారము ఒకటే!!..ఆవులు ఎన్ని రంగుల్లో ఉన్నా పాలు మాత్రము తెల్లగానే ఉంటాయి!!..అదే విధంగా *జీవుల శరీరాలు వేర్వేరుగా కనిపించినా !పరమాత్మ ఒక్కడే*!!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత