పీచు ప్రతిన
నీచు ప్రతిన చూడ నీటిపైరాతగా
నిర్ణయించవచ్చు నిలువదెపుడు
సజ్జనుండు పల్కు శాశ్వతంబైనిల్చు
శిలనుచెక్కినట్టిశిల్పమట్లు
శ్లో𝕝𝕝 అసద్భిః శపథేనోక్తం జలే లిఖితమక్షరమ్।
సద్భిస్తు లీలయా ప్రోక్తం శిలాలిఖితమక్షరమ్॥
తా𝕝𝕝 దుర్జనులచే చేయబడిన ప్రతిఙ్ఞ నీటి మీద రాత వలే వెంటనే కనుమరుగైపోవును.
సజ్జనులచే పలుకబడిన వాక్కు సాధారణమైనదైననూ శిలపై చెక్కబడిన అక్షరముల వలే శాశ్వతంగా నిలచి ఉండును.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి