నారదమహర్షి

హరికీర్తనానందమానందమూర్తియౌ
నారద మునివంద్య నతులుగొనుము
మహితిచేతనుపూనిమహసీయమూర్తిని
ధ్యానించు పూజించు నాదయోగి
 రామకథనంతయురమ్యమౌరీతిగా
వాల్మీకికందించువాగ్మినీవె
భాగవతసుధనువచియింవలెనంచు
బాదరాయుణుని మనవిజేసె
పరులబాధలనెల్లబాపగా తానెంత
సంచరించునుతానుసతతమిట్లు
కలహభోజనుమాట కల్లయౌమాటయే
అతని కథనువిన్నయర్థమగును
బ్రహ్మమానసపుత్రుండు మహితకీర్తి
ఆ.వె.కలహ భోజనుండు కాడతడెప్పుడు
పరమపూజ్యుడతడు భక్తసఖుడు
మంచివారికెపుడు మార్గదర్శియతడు
పరులమేలుకొరుకు పాటుపడును
(రచన:-విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత