నా స్వభావము
బల్లగుద్దినటుల పల్కుటే నాకొచ్చు
ఇచ్చకంపుపలుకు యింపుగాదు
పటికబెల్లమటుల పల్కలేనెప్పుడూ
మోమాటమెరుగని మొండితనము
మనసులో యికిలింపు మాటలో సకిలింపు
నేర్వలేనైతియ్యనేర్పుమెరసి
కోపిష్టివాడంచు కొండెముల్ జెప్పిన
మనసులో గలదయ్య మార్దవంబు
పలుకు తీపికొరకు పలుగాకి పలకులు
పలుకలేనునేను ప్రల్లదములు
అనుచు పలుకు వాని యనరానిమాటలు
అనుచుపల్క గలరు యల్పులెపుడు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి