కన్నవారి కడగండ్లు
కన్నవారినిటుల కడగండ్లపాల్జేసి
కన్నబిడ్డలిటులకఠిను లైరి
ముదివగ్గు నీరీతి ముప్పుతిప్పలపెట్ట
మనసుయెటులొచ్చునొ మతికి రాదె
తనకున్న దోలేదొ తలపెట్ట కుండగ
అన్నము మొత్తము నందజేయు
గంపత సంతైన గడబిడలేకుండ
ఆలించి పాలించు నమ్మయెకటె
ఆ.వే.అమ్మ నొకతె చూడ యష్టాలు కష్టాలు
వంతు లేసు కొనగ వంత పాటె
కాని కాల మొచ్చె కన్నకొడుకులిట్లు
మారి పోయినారు మతులం పోయి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి