నా స్వభావము

బల్లగుద్దినటుల పల్కుటే నాకొచ్చు
ఇచ్చకంపుపలుకు యింపుగాదు
పటికబెల్లమటుల పల్కలేనెప్పుడూ
మోమాటమెరుగని మొండితనము
మనసులో యికిలింపు మాటలో సకిలింపు
నేర్వలేనైతియ్యనేర్పుమెరసి
కోపిష్టివాడంచు  కొండెముల్ జెప్పిన
మనసులో గలదయ్య మార్దవంబు
పలుకు తీపికొరకు పలుగాకి పలకులు
పలుకలేనునేను ప్రల్లదములు
అనుచు పలుకు వాని యనరానిమాటలు
అనుచుపల్క గలరు యల్పులెపుడు
(రచన:౼విద్వాన్ గోల్లాపిన్ని.నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత