మేధావులు
మేధావు లనిపేరు మేకవన్నెపులులు
సామ్యవాదమనుచు చచ్చు చర్చ
వంచన కళలోన పంచమాంగదళము
దేశహితులుకాని దేభ్యసములు
ఇసుమంత దేశాన్ని యిష్టపడనివీరు
వీధినాటకమలాడ వీరులోయి
మసిపూయుకళలోనమడమతిప్పరోయి
తాలిబానులెల్లరుతాపసోత్తములంచు
బాణీలు కట్టుచుపాడగలరు
చీనిదేశమనగానె చీనీమిఠాయిలా
చప్పరించగలగు శఠులువీరు
మాతృదేశమందుమాత్సర్యమేదప్ప
మాతృభక్తిలేని మనుషులయ్య
మార్క్సుయెంగెలస్సు మావోలజపసిధ్ధి
ముక్తిమార్గమనెడి మూర్ఖబుధ్ధి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి