కర్మాను బంధమ్ము
జనియించినామేమొ జన్మజన్మాలలో
కర్మానుబంధాలకారణాన
అపవర్గమున్నట్లునసలుకే మరుపొచ్చి
మమతానుబంధాలమరగినాము
కార్పణ్యదోషాలకారణాలేమైన
సహజమౌస్థితినుంచిజారినాము
ఇహలోకసౌఖ్యాలయెండమావులవెంట
దాహార్తితో మేమంత తరలినాము
ధరలోన బ్రతుకంత ధర్మసత్రమనుమాట
మరపునకొచ్చిగా మాకునెపుడు
ఆ.వె.సృష్టిచిత్రమిదియె దృశ్యమాన జగతి
కల్లయగునుకాదె కాలగతిని
నీదుచరణసేవ నిరతంబునిచ్చుటె
ఔషధంబునాకు నుర్విపైన
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి