అతడు
వల్ల మాలినట్టి వాత్సల్య భావమ్ము
అలవికానియట్టి యాదరమ్ము
మాటలోనతీపి మనసులోన వెగటు
తేనె పూసి కొన్న తేలుకొండి
నమ్మినట్టివాన్ని నట్టేట ముంచేటి
నటనమాడునట్టి నర్త కుండు
సూక్తిసుధలు చెప్పి సున్నంబు పూయును
వచ్చినాడు వాడు వదలడింక
నక్కవినయమొప్ప నయగార మొలకించి
పటికబెల్లమటుల పలుకరించి
ప్రజలకార్యమెల్ల పాడుచేయునుగాని
బాగుచేయనట్టి పాపియతడు
మంచిపనుల నెంచ మచ్చుకైననులేవు
వెధవ పనులనెంచ వేనవేలు
మెచ్చవలయునెట్లు మెరమెచ్చుమాటల
నిజము పల్కితంచు నిందవలదు
[ఈ పద్యములను మీరెవరైకైన అంకితం చేయవచ్చు. ఇందులో నాప్రోత్సహం ఆవగింజంతైనా లేదు.]
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి