పనికిరాని వాని ప్రతిన

పనికిరాని వాని ప్రతినవ్యర్థమగును
నీటిమీదిరాత నిలువ నట్లు
మంచివారి ప్రతిన మన్వంతరముదాక
రాతిపైనవ్రాయురాతవోలె

*శ్లోకం*

అసద్భిః శపథేనోక్తం జలే లిఖితమక్షరమ్।
సద్భిస్తు లీలయా ప్రోక్తం శిలాలిఖితమక్షరమ్॥

(సుభాషితరత్నావళిః)

*తాత్పర్యం*

దుర్జనులచే చేయబడిన ప్రతిఙ్ఞ నీటి మీద రాత వలే వెంటనే కనుమరుగైపోవును.
సజ్జనులచే పలుకబడి‌న వాక్కు సాధారణమైనదైననూ శిలపై చెక్కబడి‌న అక్షరముల వలే శాశ్వతంగా నిలచి ఉండును......

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత