ఉపాధ్యాయ దినోత్సవం

అంతరాయమసలు నందనట్టిచదువు
అంతరజాలాన నసలు లేదు
దశగుణములొసగు దండమ్ము చేబూని
ఒజ్జనేర్పగలడు వోర్మి తోడ
గురువునేర్పుచదువు గుర్తుండి పోవును
కాలమ్ము గడిచినా జ్ఞప్తినుండు
చదువుతో బాటు సంస్కారమందించి
బాగుచేయుగురువు బాల్యమందు
ఆ.వే గురువు లేని విద్య గుడ్డివిద్యయ
నుచు
పెద్ద లన్ని మాట చద్ది మూట
ఎన్ని వనరులున్న యెరుకలేనిచదువ
ఫలిత ముండ నెట్లు  బాల లార!
(రచన:-విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)
(ఇంటర్నెట్ లు గూగుల్ లు ఉపాధ్యాయుల సాటిరావు. అవి కేవలం సమాచారాన్ని మాత్రమే ఇవ్వగలవు.వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దలేవు.)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత