అంబరమణి

అంబరమణియైన యాదిత్యుడరుదెంచె
గగనమండలమంత గర్వపడగ
తెల్లబోయెనరునితెలివిలా ఫ్రాక్దిశ
కనుపట్టె మనకంత కనుల ముందు
ఏడుగుర్రాలతో యేతేరె రథమంత
ఒంటిచక్రమనుట వోటిమాట
కాటుక చీకటి గజగజా వణకుతూ
పరుగెత్తి పరుగెత్తి పారిపోయె
ఆ.వే అతడు లేక జగతి కస్తిత్వమేలేదు
అర్క డనెడి పేరుయాప్తుడితడు
వంద నమ్ము సేయ వరమిచ్చు
 దేవుడు
చారు శీలు డనగ ఛాయపతియె
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)
తపనుడనెడిపేరు తాపంబు బాపను
మిత్రుడనెడీపేరు మైత్రి చూపు
ఆదిత్యుడనుపేరు నారోగ్య మందించు
భాస్కరుండనుపేరు భాగ్యమొసగు
కర్మసాక్షియనిపేరు కర్మముల్జూచును
భానుడనెడిపేరు భావమెరుగు
వేదాత్ముడనుపేరు వేదవేద్యుడతడు
సూర్యడనెడి పేరు సూరిజనుల బ్రోచు
సకల జగతి కతడు సౌఖ్యంబు కలిగించు
కామితార్థ మొసగు కల్ప తరువు
ఆత్మరూపుడతడు నార్తిజనులబ్రోచు
వందనీయ నీకె వందనాలు
(రచన:౼విద్వాన్ గోల్లా పిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత